Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఉద్యమాల పురిటిగడ్డ జనగామలో ఎర్రజెండా రెపరెపలాడుతోంది. నేటి నుంచి జరిగే సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలకు జనగామ ముస్తాబైంది. పట్టణాన్ని ఎర్రజెండా తోరణాలతో అలంకరించారు. మహాసభలు జరిగే వైష్ణవి గార్డెన్ హాల్ (అంభటి సత్యనారాయణ ప్రాంగణం) ఎర్రజెండాలతో ఎరుపెక్కింది. పార్టీ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో మహాసభల ఏర్పాట్లు పూర్తి చేశారు. వైష్ణవి హాల్లోనే ఉదయం 11 గంటలకు ప్రారంభ భహిరంగ సభ నిర్వహించనున్నారు. కోవిడ్ నిబం ధనల దృష్ట్యా హైకోర్టు ఆదేశాల మేరకు పట్టణంలో ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు రద్దయ్యాయి. దీంతో మహాసభలకు ముందు హాల్లోనే ప్రారంభ బహి రంగ సభ జరగనుంది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లా డనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మహాసభలను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య ప్రారంభించనున్నారు. మహా సభలు నేడు, రేపు రెండు రోజులు జరగనున్నాయి. రెండవ రోజు ముగింపు సభకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య ముఖ్యతిథిగా పొల్గొననున్నారు. సంబం ధిత ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జనగామ పట్టణంతో పాటు జిల్లాలోని 12మండలాల నుండి 500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ద్వితీయ మహాసభలు...
మహాసభల సందర్భంగా తొలి రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభ మహాసభ జరగనుంది. ఈ ప్రారంభ మహాసభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటటి సభ్యులు వీరయ్య, నాగయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతారు. సాయంత్రం 4 గంటల నుండి మహాసభ ప్రారంభం కానుంది. మహాసభను ప్రారంభిస్తూ జెండావిష్కరణ చేయయనున్నారు. అనంతరం కార్యదర్శి నివేధిక ప్రవేశపెట్టనుండగా మరుసటి రోజు చర్చలు జరగనున్నాయి. అనంతరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక, ముగింపు కార్యక్రమం జరనుంది.
జయప్రదం చేయాలి
నవతెలంగాణ-పాలకుర్తి
నేడు, రేపు జనగామలో జరిగే సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సోమ సత్యం, చిట్యాల సోమన్న పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో నాలుగేండ్లుగా సీపీఐ(ఎం) నిర్వహించిన ప్రజా ఉద్యమ, పోరాటాలను సమీక్షించుకొని భవిష్య త్ పోరాటాలకు కార్యాచరణ రూపకల్పనకు మహా సభలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు, విద్యార్థులు, యువజనులు, ఉద్యోగులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు వత్తిదారులు ఎదుర్కొం టున్న సమస్యలపై అనేక ప్రజా పోరాటాలు నిర్వహిం చామని తెలిపారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మాచర్ల సారయ్య, మాసంపల్లి నాగయ్య, బానోత్ కిషన్‌నాయక్, బెల్లి సంపత్, ముస్కు ఇంద్రారెడ్డి, అనిల్ చౌహాన్, తోటకూరి శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : నేడు, రేపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన పోరుగడ్డ జనగామ జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్లో నిర్వహించే సీపీఐ(ఎం) రెండవ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) పాలకుర్తి నియోజకవర్గ ఏరియా కార్యదర్శి సింగారపు రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అన్నారు. ప్రభుత్వాల పరిపాలన లోపాలను ఎండగట్టడానికి నిర్వహించే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
లింగాలఘనపురం : నేడు జిల్లా కేంద్రంలో జరుగనున్న సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహసభలను జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి బోడ్డు కరుణాకర్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో గోసంగి శంకరయ్య అధ్యక్షత్న ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవాదానం, సమ్మయ్య, ఉప్పలయ్య, చెన్నూరు ఉప్పలయ్య భిక్షంగౌడ్, సత్తయ్య పాల్గొన్నారు.