Authorization
Mon Jan 19, 2015 06:51 pm
: మోకు కనకారెడ్డి
నేడు, రేపు జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మహాసభల ఏర్పాట్ల పనులను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. ప్రజా ఉద్యమాల పురిటిగడ్డ జనగామలో సీపీఐ(ఎం) మహాసభలు జరుగుతున్నాయన్నారు. దోపిడి, పీడనను ఎదిరించి బాంచెన్ కాల్మొక్తా అన్న చేతులతో బందూకులు చేతపట్టి దొరతనాన్ని తరిమికొట్టిన చరిత్ర జనగామకు ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగగా ఆ స్ఫూర్తిలో జనగామలో సీపీఐ(ఎం) పోరాటాలు చేస్తున్న దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజా ఉద్యమాలు చేపడుతూ ప్రజలకు సీపీఎం మరింత చేరువవుతుందన్నారు. భవిష్యత్లో జిల్లా సమగ్రా భివృద్ధే లక్ష్యంగా పార్టీ పనిచేస్తున్నదన్నారు. పోరా టాల స్పూర్తిగా జిల్లా అభివృద్ధే లక్ష్యంగా మహా సభలు జరగనున్నాయని తెలిపారు. మహాసభల సందర్భంగా నిర్వహించే ప్రారంభ మహాసభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.