Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం జాతర సమీపిస్తున్న తరుణంలో అభివద్ధి పనులను సకాలంలో త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మేడారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌లో వివిధ శాఖల నోడల్ అధికారులతో ఆమె సోమవారం సమీక్షించారు. పార్కింగ్, ఎలక్ట్రిసిటి, కమ్యూనిటీ టాయిలెట్లు, జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద టాప్స్, లేబర్ వర్కర్స్, తాగునీటి నల్లాల బిగింపు, తదితరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ త్రిపాఠి మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. ఆర్టీసీ డీఎం ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాలను పరిశీలించి అటవీ శాఖ అధికారులతో సమన్వయంతో పనులు చేయాలిని చెప్పారు. ఎక్సైజ్ శాఖ అధికారులు జాతరలో మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ అమలును చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత జాతరలో తలెత్తిన లోపాలను గమనంలో ఉంచుకుని మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, పారిశుద్ధ్యం, తాగునీటి, విద్యుత్, వైద్యం, తదితర అంశాలపై అధికారులు ప్రణాళికాయుతంగా పని చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో కూతాటి రమాదేవి, మేడారం ఈఓ రాజేందర్, ఇరిగేషన్ సీఈ వెంకట కష్ణారావు, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్లు శ్రీనివాస్, సత్యనారాయణ స్వామి, నాగరాజు, ఎలక్ట్రిసిటీ డీఈ జీఎల్ఎం రెడ్డి, డీఎల్పీఓ దేవరాజ్, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.