Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ లో గతంలో మేనేజర్ గా విధులు నిర్వర్తించిన పూర్ణచందర్, మహిళా సంఘాల సీఏ దండు శోభన్ తో కలిసి రూ.10 లక్షలు కాజేసిన విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం జోనల్ ఆఫీస్ నుంచి విచారణ అధికారులు బ్యాంకుకు చేరుకుని ఆడబిడ్డల సొమ్ము కాజేసిన బ్యాంకు మేనేజర్ చేతివాటంపై ఆరా తీశారు. ఈ లోగ బ్యాంకు వద్దకు చేరుకున్న మహిళా సంఘాలు తమ డబ్బులు తమకు ఇప్పించాలని ఆందోళనకు దిగారు. అంతేకాకుండా బ్యాంకుకు తాళం వేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.