Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
హైదరాబాద్ నోవిటల్ హౌటల్లో మంగళవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహించిన జాతీయ మిషన్-ఆయిల్ పామ్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, దాసరి మనోహర్ రెడ్డి, శ్రీ హర్ష వర్ధన్ రెడ్డి, శ్రీ సురేందర్, యువ నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి ఉన్నారు.