Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల పరిధి సూరారం గ్రామ పంచాయతీలో మంగళవారం పాఠశాల విద్యార్థులు, ప్రజలకు మిషన్ భగీరథ, తాగునీటి నీటి సరఫరాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిషన్ భగీరథ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాంచంద్రం, ఏఈ వినరుకుమార్ పాల్గొని మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి శుద్ధమైన తాగునీరందిస్తున్నట్టు తెలిపారు. స్థానిక పాఠశాలకు కూడా మిషన్ భగీరథనీటిని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో ఎంపీపీ రాణిబాయి రామారావు, జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, ఎంపీడీఓ శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇజినీర్ నిర్మల, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినరు, సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.