Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
నవతెలంగాణ-2022 నూతన క్యాలెండర్ను మంగళవారం ఎంపీపీ పంతకానీ సమ్మయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు న్యాయం జరిగే వరకు నవ తెలంగాణ దినపత్రిక నిరంతరం పని చేయడం అభినందనీయమని అన్నారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ ముందుంటుందని అన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల ,పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవ తెలంగాణ పత్రిక నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. గతేడాది మంచిచెడులను మరచి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రజలందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేము నూరి ప్రభాకర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుర్రెడ్డి శివ సాయి కష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రమేష్, హౌంసింగ్, దుర్గం రాజబాబు పాల్గొన్నారు.