Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండల కేంద్రంలోని లారీ ఆఫీస్ ఎదురుగా ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా ఉన్న రోడ్డుకు మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ బిందునాయక్ మరమ్మతు పనులు చేయించారు. రోడ్డుపై గుంతల్లో ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి గాంధీ పురానికి చెందిన ఆశా వర్కర్ జ్యోతి మృతిచెందిన విషయం తెలిసిందే ఘటన స్థలాన్ని సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డితో కలసి ఆమె పరిశీలించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చెడిపోయిన రోడ్లకు మర మ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మృతురాలు జ్యోతిక కుటుంబానికి సంతాపం తెలిపారు. వలిగొండ-కొత్తగూడెం పరిధిలోని రహదారిని పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.అనంతరం మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న కైరంకొండ సోమయ్యని, బొమ్మగాని జమ్మూను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తమ్మిశెట్టి వెంకటపతి, పగడాల శ్రీనివాస్, బొబ్బిలి కిరణ్, జగ్గుతండా గ్రామ కార్యదర్శి సోమిరెడ్డి, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెహ్రూ బాబు, ఆర్అండ్బీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, వార్డు సభ్యులు అనిత కుమారి -శ్రీనివాస్, నాయకులు వెంకటపతి, శ్రీనివాస్, కిరణ్, సంపత్, నర్సయ్య పాల్గొన్నారు.