Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దారులన్నీ ఎరుపుమయం
అ అట్టహాసంగా మహాసభలు ప్రారంభం
సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా కష్టజీవులు కదలొచ్చారు. మహాసభల ప్రారంభరోజైన మంళవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు బారీగా తరలి వచ్చారు. కరోనా నిబంధనల మేరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాలీలు నిషేధం కావడంతోనే మహాసభల నిర్వహణ ప్రాంగణంలోనే ప్రారంభ మహాసభను నిర్వహించారు. మహాసభల నిర్వహణ ప్రాంగణం వైష్ణవి గార్డెన్ ఆటా పాలటలతో దద్దరిల్లింది. మహాసభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటి సభ్యులు వీరయ్య, నాగయ్యలు పాల్గొని మాట్లాడారు. మహాసభల సందర్భంగా దారులన్నీ ఎరుపుమయం అయ్యాయి. దీంతో సీపీఐ(ఎం) మహాసభలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా స్థానిక ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూపార్క్ మీదుగా రైల్వె బ్రిడ్జిదిగి వైష్ణవి గార్డెన్‌కు వెళ్లేఆ తోరణాలు ఏర్పాటు చేశారు.
సీపీఐ(ఎం) మహాసభల ప్రారంభానికి ముందు ప్రారంభ బహిరంగ సభ నిర్వహించగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్ జెండా ఎగరవేశారు. కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కార్యదిర్శ నివేదిక సమర్పించారు. భవిష్యత్ ఉద్యమాలకు పునాదిగా గత 4 సంవత్సరాలలో జిల్లా కమిటీమ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు తీరుకు అద్దం పడుతుంది. ప్రజలను భాగస్వాములను చేస్తు సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలను మరిన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. క్తలు ఉపన్యాసం సీపీఐ(ఎం) నాయకుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేలామ మహాసభలు అట్టాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభలకు అధ్యక్షవర్గంగా వేంకట్రాజం, ఇర్రి అహాల్య, బూడిద గోపి, రాపర్తి రాజులు వ్యవహారించారు. జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి కార్యదర్శి నివేధికను ప్రవేశపేట్టారు.