Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహాసభలు మంగళవారం జనగామ పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభల ప్రారంభోత్సవ సభలో కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, వీరయ్యతో కలిసి తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రవ్యాప్తంగా 32జిల్లాలకు ఎలా నీరందిస్తారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే కొన్ని జిల్లాలకు మాత్రమే నేరందుతుందని ప్రాజెక్టులన్ని పూర్తి స్థాయిలో చేపడితే అన్ని జిల్లాలకు నీరందుతుందన్నారు. ఉద్యమాల ఖిల్లా పోరాటాల పురిటిగడ్డ జిల్లా జనగామ త్యాగధనుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మెడలు వంచి ఎస్రెడ్డినగర్ గుడిసె వాసుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉద్యమాలకు ఉందన్నారు. ప్రజా ఉద్యమాలతో పాటు ఐక్య ఉద్యమాలు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కషి చేయాలన్నారు. జనగామ నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్, కాజీపేట తదితర ప్రాంతాలకు రోజు వలస కూలీలు వెళ్లి వస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని రెచ్చగొడుతూ దేశంలో మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. సీఎం కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విస్మరించి ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షాన నిలబడి పోరాటం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ చట్టాలను అమలు చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శ ఆముదాల మల్లారెడ్డి , ఏఐఆర్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోట్ల శ్రీనివాస్ ,ఇర్రి అహల్య, ఎద్దునూరి వెంకటరాజ్యం, సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ళబండి శశిధర్, జిల్లా కమిటీ సభ్యులు ఉపేందర్, బూడిద గోపి,బోట్ల శేఖర్, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమయ్య ,చిట్యాల సోమ సత్యం,గొల్లపల్లి బాపురెడ్డి, రామావత్ మీట్య, ప్రజ్ఞాపూర్ నర్సింలు, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, యాకన్నా, బొడ్డు కర్ణాకర్, పొదల నాగరాజ్ ,బోడ నరేందర్, మునిగల రమేష్, గంగాపురం మహేందర్, జువారి రమేష్, జోగు ప్రకాష్ ,దస్తగిరి, పంపర మల్లేశం,చందు నాయక్, బిట్ల గణేష్, ఎండి అజరుద్దీన్ ,సందీప్, నాగరాజ్ ,లలిత, జ్యోతి, భవాని, తదితరులు పాల్గొన్నారు
నాటి పోరాటాల స్ఫూర్తిగా ఉద్యమాలు...
జనగామ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిగా ఉద్యమాలు చేపట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. మహాసభలకు తమ్మినేని వీరభద్రంతో పాటు కేంద్ర కమిటి సభ్యులు వీరయ్య, నాగయ్యలు ముఖ్యఅతిధులుగా హాజరు కాగా సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ఉద్యమాలకు కేంద్రంగా జనగామ ప్రాంతం నిలిచిందన్నారు. నాటి పోరాటాలను స్పూర్తిగా తీసుకోని నేటి పరిస్థితులను అనుకూలంగా ప్రజా పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న జనగామలో ప్రజా ఉద్యమాలు నిర్వయించడానికి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు పరిశ్రమల ఏర్పాటు, జిల్లాలో వైద్య , నర్సింగ్ కాళాశాల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, నీటి ప్రాజెక్టులు వంటి అనేక సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.