Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐసీసీ అధికార ప్రతినిధి తేజవత్ బెల్లయ్య నాయక్
నవతెలంగాణ-గూడూరు
బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ దేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి తేజావత్నాయక్ అన్నారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలో గొల్లగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షులు కత్తి స్వామి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో బెల్లయ్య నాయక్ మాట్లాడారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఏ పార్టీకి లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. కానీ, స్వరాష్ట్రంలో గద్దెనెక్కిన కేసీఆర్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కుటుంబ పాలన సాగిస్తున్నాడని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. గూడూరు మండలానికి త్వరలో పీసీసీ కృషి చేస్తానని హామీనిచ్చారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులొ చురుకుగా పాల్గొని జిల్లాలో మండలానఇన మొదటి స్థానంలో నిలపాలన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నునావత్ రాధ, పీసీసీ సభ్యులు దాశ్రు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నునవత్ రమేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ బాధ్యులు పాషా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సతీష్ గౌడ్, సీనియర్ నాయకులు శంకర్, శ్రీపాల్ రెడ్డి, మల్లేష్ , స్వామి, రసూల్ పాల్గొన్నారు