Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిలవాలని కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలను ఆయన మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రగతి, వసతి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. పాఠశాల ఆవసరాలకు కావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి కొట్లాడి సాధించి పాఠశాల ప్రగతికి కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కుమార్, పద్మ, నాయకులు దాసరి రాజు, ఉపాధ్యాయులు సుశీల, రాములు, శ్రీధర్, తదితరులున్నారు.