Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
గ్రామ పంచాయతీ నుంచి సమ్మక్క జాతర నిర్వహించే ప్రాంతం వరకూ రోడ్డు పనుల కోసం నిధులు మంజూరు చేయాలని దామర సర్పంచ్ చల్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రోడ్డు పనులతో పాటుగా, వృద్ధుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. దీంతో సంక్రాంతి తర్వాత అన్ని పనులకు శంకుస్థాపన చేస్థానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీఆర్ఎస్ గ్రామ శ్ాఖ అధ్యక్షుడు సాతురి చంద్రమౌళి, వార్డు సభ్యులు రాజేందర్, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.