Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
జాతీయ సాంకేతిక విద్యాలయం(నిట్) వరంగల్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్గా ప్రొఫెసర్ పులి రవికుమార్ పదోన్నతి పొందారు. దీంతో నిట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఉద్యోగులు మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఉద్యోగుల తరుపున మైదం సంజీవ మాట్లాడారు. నిట్ ఏర్పాటు చేసి ఆరవై ఎండ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పాలకమండలి పోస్టుల్లో నిర్ణయాలు తీసుకునే పదవులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిట్ అంబేద్కర్ వెర్నిటంగ్ సెంటర్లో నెలకొల్పాలని కోరారు. నిట్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ ఇటికాల మధుసూదన్ రావు పేరును ఆడిటోరియంకు పెట్టడానికి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్, సుభాష్, చంద్రబోస్, వీరేశ్ బాబు, శివకుమార్, ప్రకాష్, రవి, ఐలయ్య, శ్రీనివాస్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.