Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలోని మినీ స్టేడియంలో జియో టవర్ నిర్మాణం పనులను నిలిపేసి టవర్ను తొలగించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి డ్యాగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మినీ స్టేడియంలో జియోటవర్ నిర్మించడం వల్ల రేడియేషన్తో వ్యాయమం కోసం వస్తున్న వద్ధులు, యువకులు, మహిళలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టవర్ రేడియేషన్తో అనేక ఆరోగ్య సమ స్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జియో టవర్ నిర్మాణం చేసిన పనులు నిలిపి వేసి అక్కడ నుండి టవర్ను తొలగించాలన్నారు. లేనిపక్షంలో బీఎస్పీ, బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ కోశాధికారి మాసాని రమేష్, బీసీ సంఘం నాయకులు శీరంశెట్టి రాజేందర్, రాజ్ కుమార్, శ్రీకాంత్, రమేష్, పింగళి కుమార్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.