Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిందుతుల అరెస్ట్,
రూ.14.17లక్షల విలువజేసే ఉత్పత్తులు స్వాధీనం
నవతెలంగాణ-నర్సంపేట
అక్రమంగా నిల్వచేసిన గుట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్ప్క్టర్లు సీహెచ్ శ్రీనివాస్, ఆర్ సంతోష్ కథనం ప్రకారం.. పట్టణంలోని సాయినగర్‌లోని పుల్లూరి జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా గుట్కా, అంబర్ ప్కాకెట్లు నిల్వ ఉందని సమాచారం మేరకు అదనపు డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ నేతృత్వంలో దాడులు చేపట్టారు. ఈ సోదాలో రూ.13.50లక్షల విలువజేసే 27అంబర్ సంచులు, రూ.30వేలు విలుజేసే 2ఆర్ఆర్ సంచులు, రూ.19,500 విలువ కలిగిన 195 జేకే జర్థా ప్యాకెట్లు, రూ.17,500 విలువజేసే 35 ప్యాకెట్ల అంబర్ ప్యాకెట్లు లభ్యమైయ్యాయి. బీదర్‌లో తయారు చేసిన ఈ గుట్కా, అంబర్ ప్యాకెట్లను రత్నాకర్ అనే వ్యక్తి వాహనాలలో తీసుకొచ్చాడు. ఈ అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న కొత్తగూడ మండలానికి చెందిన వల్ముదాసు వెంకటనారాయణ, సాంబశివుడు, శ్రీనివాస్ అనే కిరాణం కొట్టు వ్యాపారులను అదపులో తీసుకొన్నారు. బీదర్‌కు చెందిన రత్నాకర్ పరారయ్యాడు. గుట్కా, అంబర్ సంచులను తరలిస్తున్న సిఫ్టు కారు, రెండు టాటా ట్రాలీలు, ఒక స్మార్టు ఫోన్ స్వాధీన పర్చుకొన్నామని, ఈ అక్రమ కార్యకలాపాలపై కేసు నమోదు చేసుకొని నలుగురు నిందులను అరెస్టు చేసినట్లు సీఐలు శ్రీనివాస్, సంతోష్ తెలిపారు.