Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వజూనియర్ కళాశాల ఏర్పాటుకు అధికారుల పర్యటన
వచ్చే విద్యా సంవత్సరం నాటికి
తరగతుల ప్రారంభం : డీఐఈఓ శ్రీనివాస్
నవతెలంగాణ-పాలకుర్తి
నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కల నెరవేరనుంది. ఎన్నికల సందర్భంగా పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పా టుతోపాటు,వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీంతో మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు గురువారం ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ తో కలిసి డిఐఈఓ బి.శ్రీనివాస్ మండల కేంద్రంలో ని ఉన్నత పాఠశాలను సందర్శించి భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహణకు ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు భవనాన్ని అప్పగించేందుకు హామీ పత్రాన్ని ఇవ్వాలన్నారు. కళాశాల నిర్వహణతో పాటు ఫర్నిచర్ ఏర్పాటు కోసం, అధ్యా పకులను నియమించేందుకు అఫడవిట్తోపాటు(సి డి సి) కాలేజీ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, రూ, 4 లక్షల వాటా దనాన్ని సమకూర్చాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కళాశాలలో తరగతులను ప్రారం భిస్తామని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ఓరుగంటి రమేష్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జీడి సమ్మయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల మల్లయ్య, టిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గుగ్గిళ్ళ యాకయ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.