Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
రైతుబంధు పథకంలో భాగంగా ఎనిమిదో విడత పెట్టుబడి పరిహారం అందించి రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుల చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ ఆధ్వర్యంలో గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు తో కలిసి నవీన్ మాటాడారు. రైతులకు రైతుబంధు పథకం లో పెట్టుబడి సహాయాన్ని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జెడ్ పి ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు పాము శ్రీను, కమ్మగాని నాగన్న, ఎంపీటీసీ ఎడవెల్లి పురుషోత్తం, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ ఖాన్, టిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు నోముల సతీష్, సర్పంచ్ బొమ్మగాని కొమురయ్య, నాయకులు పాల్గొన్నారు.