Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
సామాజిక తనిఖీలో అధికారులు బాద్యతగా పని చేయాలని ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన 14వ సామాజిక తనిఖీ లక్ష 5 వేల 572 రూపాయల రికవరీతో ముగిసింది. సామాజిక తనిఖీని ఎంపీపీ ఆధ్వర్యంలో ప్రారంభించగా ఆయన మాట్లాడారు. అనంతరం డీఆర్డీఏ పీడీ నాగపద్మజ మాట్లాడారు. ప్రభుత్వ నిధులను ఉపాధి కూలీలకు సక్రమంగా అందించేందుకు నిబంధనలకు లోబడి కార్యదర్శులు విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం పంచాయతీల వారీగా సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కరోనా కారణంగా గత రెండేండ్ల ఉపాధి నిధులు రూ.14 కోట్ల ఖర్చులను సమీక్షించినట్టు తెలిపారు. ఉపాధి నిధుల సక్రమ వినియోగంలో మండలాన్ని టాప్ విభాగంలో నడిపిస్తున్న అధికారులను ప్రశంసించారు. తప్పులు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. ఏపీడీ వెంకట నారాయణ మాట్లాడుతూ విడతలుగా సామాజిక తనిఖీ నిర్వహణలో అధికారులు తప్పులను గుర్తించి జాగ్రత్తగా నిర్వర్తించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా 19 వేల 910 రూపాయలు, పంచాయతీల ద్వారా రూ.85 వేల 600లు రికవరీ గుర్తించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు భవిష్యత్‌లో పనిని పాజిటివ్ దక్పథంతో నిర్వర్తించి మరింత న్యాయం చేకూర్చాలని సూచించారు. కార్యక్రమంలో డీవీసీ ఎస్ఆర్పీ రాఘవులు ఈజీఎస్ ఏపీఓ రాజు, ప్రసన్న, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.