Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థుల దాతల సాయాన్ని వినియోగించుకుని అభివద్ధి చెందాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆకాంక్షించారు. మండలంలోని రాఘవపట్నం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాతలు అందించిన స్కూల్ బ్యాగ్‌లను, నోటు పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. ఫైవ్ ఫింగర్స్, తెలంగాణ నెటిజన్స్ ఫోరమ్‌ను సాయం కోరగా 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, నోటు పుస్తకాలను అందించారని చెప్పారు. అరుణ్, శ్రీనివాస్, కుమార్, మల్లేష్‌లను సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.
మృతుడి కుటుంబానికి సీతక్క పరామర్శ
రాఘవపట్నం గ్రామానికి చెందిన దబ్బగట్ల గోవింద్ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని సీతక్క పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోవింద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మెన్ పన్నాల ఎల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, నాయకులు కోరం మోహన్, కంటెం సూర్యనారాయణ, మున్నా, సాంబయ్య, సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.