Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాణ పనులు ప్రారంభం
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
మండలంలోని మహమూద్‌పట్నం గ్రామంలోని 5వ వార్డు పరిధిలో రూ.5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు మంజూరైనట్టు సర్పంచ్ శతకోటి సారమ్మ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈజీఎస్ కింద నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏశబోయిన రవీందర్, ఎంపీటీసీ ధరావత్ చంద్రు, వార్డు సభ్యులు, కాసోజు గణేష్, దాసరి లచ్చమ్మ, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శతకోటి నరేష్, పిట్టల విజేందర్, వాంకుడోత్ రాంసింగ్, ఎలిజాల యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.