Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
మహబూబాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండలంలోని ఇంటికన్నె గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఘనపారపు సరిత రమేష్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన 'మన ఊరు-మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పలు సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి సమాధానం చెప్పారు. స్వల్ప సమస్యలను వెంటనే పరిష్కరించారు. ఓట్ల కోసం కాదని, గ్రామాల అభివృద్ధి కోసమే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని చెప్పారు. పని చేస్తున్న వారినే ప్రజలు ఆదరిస్తారని స్పష్టం చేశారు. అందుకే సీఎం కేసీఆర్ నిత్యం ప్రజాసమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించడంతో కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, ఏఎంసీ చైర్మెన్ నారాయణరావు, ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, మండల కోఆర్డినేటర్ ప్రవీణ్, మాదారపు సత్యనారాయణరావు, సర్పంచ్ సరిత రమేష్, మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రవిచందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, యాకూబ్‌రెడ్డి, కముటం శ్రీను, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, బానోత్ వెంకన్న నాయక్, తదితరులు పాల్గొన్నారు.