Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
మండలంలోని అమ్మపురం గ్రామానికి చెందిన తమ్మెర విజయలక్ష్మి బుధవారం మృతి చెందగా మృతదేహాన్ని ఆమె తనయుడు రామారావు, ఇతర కుటుంబీకులు ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు గురువారం అప్పగించారు. ఈ సందర్భంగా అంగీకార పత్రాన్ని మెడికల్ కళాశాల ప్రతినిధులకు అందించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వైద్యుల పరిశోధన కోసం మృతదేహాన్ని అందించడం అభినందనీయమని సర్పంచ్ కడెం యాకయ్య అన్నారు. శరీర, అవయవదానం సమాజ హితానికి తోడ్పడు తుందని చెప్పారు. ప్రతిఒక్కరూ అవయవ దానానికి ముందుకొచ్చి ఇతరుల ప్రాణాలు నిలిపేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో మమత మెడికల్ కాలేజీ ప్రతినిధులు డాక్టర్ ఉదరు కుమార్, కల్పన, రమ్య, తదితరులు పాల్గొన్నారు.