Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేర రహితంగా మార్చేందుకు కృషి : ఎస్పీ
నవతెలంగాణ-తొర్రూరు
జిల్లాలో అక్రమ వ్యాపారాల పై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి జిల్లాను నేర రహితంగా మార్చేం దుకు కృషి చేస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన తొర్రూరు పోలీస్‌స్టేషన్‌ను గురు వారం ఆకస్మికంగా సంద ర్శించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ కరుణాకర్రావులతో కలిసి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు కషి చేస్తామన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనుమానితుల, సంఘ విద్రోహ శక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు అందించాలని కోరారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు గుండ్రాతి సతీష్, రాంజీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.