Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గత నెల గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలో రాష్ట్రం నుంచి సీనియర్ క్రికెటర్ తాటి కృష్ణవేణి పాల్గొని ప్రతిభను చాటి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ 2021-2022కు ఎంపికైంది. యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ 16 జనవరి 2022 నుంచి 20 జనవరి 2022 వరకు ఇంటర్నేషనల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నిరుపేద కుటుంబం కావడంతో నేపాల్ టోర్నీకి వెళ్లే స్థోమత లేకపోవడంతో ములుగు జిల్లా వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి రూ.5 వేలు సాయం అందించారు. కృష్ణవేణి క్రీడా రంగంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరుతూ అభినందించారు. ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి చందా మహేష్, రాష్ట్ర నాయకుడు ఇరుప సురేందర్, మాదిగ విద్యార్థి సమాఖ్య ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుర్రి సతీష్ పాల్గొన్నారు.