Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊరు విడిచి
వెళ్లలేక మనోవేదన
నవతెలంగాణ-మహబూబాబాద్
జీఓ నెంబర్ 317 ఓ ప్రధానోపాధ్యాయుడి కుటుంబంలో చిచ్చు పెట్టింది. బదిలీ బెంగతో ఊరిని విడవలేక ఉపాధ్యాయుడు మనోవేదనతో గుండెపోటుకు గురై హఠాన్మ రణం చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురు వారం చోటు చేసుకుంది. స్థానికంగా కల కలం రేపిన ఘటన వివరాలిలా.. బంజర గ్రామ శివారులోని సంధ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు బానోతు జేతురామ్ (55) నెల్లికుదురు మండలంలోని చెట్ల ముప్పారం లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యా యుడిగా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం మహబూబాబాద్ జిల్లా కాగా జీఓ నెంబర్ 317 ప్రకారం ఇటీవలే ములుగు జిల్లాకు కేటాయించారు. త్వరలోనే ఉద్యోగ విరమణ చేయాల్సిన తరుణంలో కుటుంబాన్ని, స్వ స్థలాన్ని వీడి వెళ్లాల్సి వస్తోందంటూ పలువురి వద్ద వాపోయాడు. ఈ క్రమంలో గురువారం పాఠశాలకు వెళ్లలేదు. ఇంట్లో తీవ్ర అస్వస్థత కు గురికాగా కుటుంబీకులు జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
ప్రభుత్వం చేసిన హత్య
మల్లారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
జేతురామ్ హఠాన్మరణం ప్రభుత్వం చేసిన హత్యే అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని ఆయన బాధిత కుటుంబాన్ని ఏరియా ఆస్పత్రి వద్ద పరా మర్శించారు. జోనల్ వ్యవస్థ ప్రకారం భార్యాభర్తలను ఒకే ప్రాంతానికి కేటాయిస్తా మని ప్రకటించిన ప్రభుత్వం అందుకు భిన్నంగా బదిలీల ప్రక్రియ చేపట్టి జేతురామ్ ప్రాణాలను బలిగొందని ఆవేదన వెలి బుచ్చారు. జీఓ నెంబర్ 317 అంతు పట్టడం లేదన్నారు. రోజుకో రకంగా నిబంధనలు విడుదల చేస్తూ ఉపాధ్యాయులను వేదనకు గురి చేస్తోందన్నారు. తక్షణమే జీఓ నెంబర్ 317ను రద్దు చేయాలని, జేతురామ్ మృతి పట్ల బాధ్యత వహిస్తూ అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.