Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, వాటిని నియంత్రించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మద్యం షాపు యజమానులు సిండికేట్గా మారి మద్యం బాబులను దోచుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఎమ్మార్పీ రేటు కాకుండా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని రెండు మద్యం షాపుల యజమానులు ప్రయివేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఎక్సైజ్ అధికారుల మంటూ బెల్టుషాపుల నిర్వాహకులను బెదిరిస్తున్నారని తెలిపారు. బెల్టుషాపులను అరిక్టకుంటే జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.