Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నారు. గురువారం పట్టణంలో అమరవీరుల స్థూపం ఎదుట ఎస్ఎఫ్ఐ 51వ ఆవిర్భవ దినోత్సవం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించి విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ... 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో 11 మందితో ఆవిర్భావించిన ఎస్ఎఫ్ఐ దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడి అనేక విజయాలు సాధించిందన్నారు. విద్యా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలపై చేపట్టిన అలుపెరగని పోరాటాల్లో అనేక మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేసిన ఘనత ఎస్ఎఫ్ఐకి ఉందన్నారు. వారి ఆశయాల సాధన కు రానున్న రోజుల్లో అలుపెరగని పోరాటాలు చేపట్టాలన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు రిత్విక్, శుభరాత్రి అనిల్, రాజ్ కుమార్, నాయకులు శైలజ, మౌనిక, రమ్య, కష్ణ, అనిల్, శ్రీనివాస్, శ్రీహరి, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.