Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
నగరంలో మంచినీటి పైపులైన్ లీకేజీ లను త్వరిత గతిన అరికట్టాలని బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం ప్రధాన కార్యాలయం లో పబ్లిక్ హెల్త్,బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్,నీటి సరఫరా పనులపురోగతి పై సమీక్షించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర బాటకార్యక్రమం లో గుర్తించినసమస్యలను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయాలని తెలిపారు.నగర వ్యాప్తంగా దెబ్బతిన్న పైప్ లైన్ లను మార్చాలని, లీకేజీ లను వెంటనేఅరికట్టుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ క్రింద నుండే వెళ్లే పైపులైన్ లీకెజీలను తక్షణమేరిపేర్ చేయాలన్నారు.తాగునీటి సరఫరా సమర్ధ నిర్వహణకునగరంలోని 66 డివిజన్లను రి జోన్ లుగా చేయుట కు చర్యలు చేపట్టాలని కోరారు. బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు నగరంలో పర్యటించి పాత వాల్వ్ మార్చడం, కావలసిన కొత్త వాల్వ్ ల ఏర్పాటుకు ప్రతిపాదించాలని అన్నారు.పైపులైన్ల కొరకు త్రవ్విన రోడ్లను జాప్యం జరగకుండా వెంటనే మరమ్మతులుచేయాలన్నారు.వచ్చే వారం బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో డివిజన్ల లో పర్యటించి త్రాగునీటికి సంబంధించిన పైపులైన్ లు, లీకేజీల ను గుర్తించి అరికట్టాలనిఆదేశించారు. ఈ సమీక్షలో ఈ.ఈ.శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్,నరేందర్ పబ్లిక్ హెల్త్ డీఈలు శ్రీనాథ్,ఇస్రత్ జహన్, ఏఈలు పాల్గొన్నారు.