Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
2021వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కరోనా-3 వేవ్ ఉన్నందున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాబోయే 2022 నూతన సంవత్సరంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కోడూరి మహాత్మా చారి ఆకాంక్షించారు. శుక్రవారం మండలంలో 150 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ నల్లగొని బాలకిషన్ గౌడ్, అలవాల ఎల్లయ్య, వేణు వందన, జిల్లెల్ల సిద్ధారెడ్డి, పాతూరి రామ్మోహన్ రెడ్డి, పెద్దచిట్టి మోహిన్ రెడ్డి, నీలా మల్లేశం, ఎండీ గౌస్, పాతూరి రాజిరెడ్డి, బేతి కష్ణమూర్తి, పురాణం శ్రీను, బావండ్లపల్లి రాములు, శ్రీనివాస్, ఎండీ యాకుబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.