Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు బాబుల పై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సంవత్సరపు చివరి రోజు డిసెంబర్ 31న మందుబాబులు పండగ చేసుకుందామని రోడ్డెక్కితే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు పెట్టి షాకులు ఇచ్చారు. నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ట్రాఫిక్ సిఐ వడ్డే నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ లను చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు తెలంగాణ జన్మభూమి జంక్షన్, పోచం మైదాన్, ఎంజీఎం కూడలి, వెంకట్రామ జంక్షన్లలో ప్రత్యేక బందాలతో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించే శ్వాసకోశ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ కొత్త సంవత్సరం వేడుకలు అని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువనీ యిది వాహనదారుల తో పాటు వారి కుటుంబానికి మంచిది కాదని అన్నారు. ఇది చట్టరీత్యా నేరమని మందు తాగి వాహనాలు నడిపే ముందు వారి కుటుంబం గురించి ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైలతో తనిఖీలు నిర్వహించి మందు తాగిన వారికి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.