Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నడికూడ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మి భర్త రాజేందర్ ను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం డాక్టర్ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేవెంట వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు రావు, నడికూడ మండల తెరాసపార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.