Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తూచ తప్పకండా పాటించాలని ఏసీపీ సీహెచ్.ఫణీంద్ర అన్నారు.శుక్రవారం ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కళ్లెపెల్లి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఏసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మోటర్ వెహికల్ యాక్టులోని నియమావళిని అనుసరించాలన్నారు. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మోటర్ వెహికల్ చట్టం ఎవరికి అతీతమేమి కాదని తెలిపారు. చట్టంలోని పలు నిబంధనలపై ఏసీపీ వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం కేక్‌ను కట్ చేశారు. యూనియన్ అధ్యక్షులు కళ్లెపెల్లి సురేష్ నేతృత్వంలో 30 మంది డ్రైవర్లకు యూనిఫామ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ పులి రమేష్, రూరల్ సీఐ సూర్య ప్రసాద్, ఎస్ఐ బొజ్జ రవీందర్ యూనియన్ నాయకులు కొమ్ము వినరు, కుమార్, రాంబాబు తదితర డ్రైవర్లు పాల్గొన్నారు.