Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మట్టేవాడ.
వరంగల్ తూర్పు నియోజక వర్గం ప్రధాన రహదారి పోచమ్మమైదన్, వరంగల్ చౌరాస్తా సీసీ రోడ్డు పనులను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థానిక కార్పొరేటర్ల తో కలిసి శుక్రవారం పరిశీలించారు. రోడ్డు నాణ్యత పై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నిర్ణీత సమయంలో నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్ను అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వన షమీమ్, కార్పొరేటర్లు బాల్నే సురేష్, గందే కల్పనా నవీన్, బస్వరాజు శిరీష శ్రీమాన్, రామ తేజస్విని శిరిష్ పాల్గొన్నారు.