Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అన్ని శాఖల అధికారులకు
కలెక్టర్ అభినందనలు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ ఉత్తర్వులు 317 ననుసరించి ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు, మన జిల్లా నుండి ఇతర జిల్లాలకు కేటాయించిన జిల్లా కేడర్ విభజన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల అన్ని శాఖల అధికారులను కలెక్టర్ అనుదీప్ అభినందించారు. శుక్రవారం జిల్లాకు కేటాయించిన ఉద్యోగుల వివరాలు ఐయంఎప్లో నమోదు, విధుల్లో చేర్చుకొనుట తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో అన్ని శాఖలు యుద్ధప్రాతిపదికన సీనియార్టీ రూపకల్పన, ఐయంఎఫ్ నమోదు అంశాలను పూర్తి చేయుట పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుండి మన జిల్లాకు 139 కేడర్లుకు సంబంధించి 1499 మంది సిబ్బందిని కేటాయించగా, వీరిలో ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఉపాధ్యాయుల పోస్లింగ్స్ ప్రక్రియ మిగిలిపోగా, కేడర్లకు సంబంధించి 715 మందికి నియామక ఉత్వర్వులు జారీ చేశామని చెప్పారు. అన్ని శాఖలకు కేటాయించిన సిబ్బంది ఆన్లైన్ ప్రక్రియ పూర్తయినందున విధుల్లో చేరిన ఉత్తర్వులను ఆయా శాఖల అధికారులకు పంపడం జరిగిందని తెలిపారు. అట్టి ఉత్వర్వులను సిబ్బందికి అందచేసి వారి నుండి ఉత్తర్వులు ముట్టినట్లు తిరుగు రశీదు తీసుకుని కార్యాలయ రికార్డుల్లో బద్రపరచాలని చెప్పారు. కేటాయించిన విధుల్లో చేరని సిబ్బంది వివరాలను అందచేయాలని, తదుపరి వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన సిబ్బంది జనవరి 1వ తేదీ వరకు విధుల్లో చేరే ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, ఏఓ గన్యా, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.