Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ నాయకుడు గండ్ర సత్యనారాయణ
నవతెలంగాణ-శాయంపేట
రైతుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాన్ని కొవిడ్ నియమ నిబంధనల పేరుతో రిజెక్ట్ చేస్తూ వందలాది పోలీసులతో రేవంత్ రెడ్డిని గహనిర్బంధం చేయడం అప్రజాస్వామిక చర్య అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల ఊబిలో కూరుకు పోయారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, వరి ధాన్యం కొనుగోలులో తాలు, తేమ పేరుతో కోత విధిస్తూ రైస్ మిల్లర్లు దోపిడికి గురి చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం డిసెంబర్ 30 నుండి జనవరి 4 వరకు చేపడుతున్నారని తెలిపారు. రచ్చబండ కార్యక్రమం పై పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోగా కొవిడ్ నియమనిబంధనల వల్ల అనుమతి ఇవ్వటం లేదని అడిషనల్ డిసిపి నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. బార్లకు, రెస్టారెంట్లకు, సినిమా హాల్ లకు కండిషన్ పెట్టి అనుమతులు ఇస్తున్నారని, అదే కండిషన్ పెట్టి రచ్చబండ కార్యక్రమానికి కూడా అనుమతి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిిని గహనిర్బంధం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని హెచ్చరించారు. యాసంగి సీజన్ లో రైతులకు ఇష్టం వచ్చిన పంటలు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రెండు లక్షల పరిహారం చెల్లించాలని, వరి మిర్చి పంటలు సాగు చేసి మరణించిన రైతులకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీటీసీ గజ్జి ఐలయ్య, నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, చిందం రవి, బాసాని శాంత, మారపెల్లి రవీందర్, ప్రపంచ రెడ్డి, క్రాంతి, వడ్డేపల్లి శ్రీనివాస్, నిమ్మల రమేష్, తదితరులు పాల్గొన్నారు.