Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల వెంటే ఉంటానని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి గ్రామ పంచాయతీ పరిధి గుడి తండాలో చలికాలం దృష్ట్యా నిరుపేద వద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మీ సమస్యలే నా సమస్యగా సమస్యల పరిష్కారం కోసం ముందుంటానని అన్నారు. ఆమె వెంట టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ చల్లా నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.