Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది రాకపోకలకు దూరంగా ఉందనే నెపంతో మంగపేటలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను వారికి అనుకూలంగా మల్లంపల్లికి తరలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి కుట్ర చేస్తూ అదనపు రూ.70లక్షలతో మంజూరైన అదనపు గదుల నిర్మాణాన్ని ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ శుక్రవారం తల్లి తండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం ఏటూరునాగారానికి మంజూరైన గురుకుల పాఠశాలను మంగపేటలోని సాంఘీక సంక్షేమ వసతి గహంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. దీంతో అన్ని వసతులతో ఉన్న భవనంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు 6 నుండి ఇంటర్ వరకు విధ్యనభ్యసిస్తున్నారని తెలిపారు. దీంతో ఈ ప్రాంత వాసులు తమ పిల్లలను సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివించుకుంటున్న క్రమంలో ఇక్కడ పని చేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉపాద్యాయులు వరంగల్ తదితర ప్రాంతాల నుండి నిత్యం రాకపోకలు సాగిస్తూ సిబ్బంది అండర్స్టాండ్తో వంతుల వారీగా విధులు నిర్వహిస్తూ పిల్లలకు సకాలంలో సిలబస్ చెప్పడంలేదనే ఆరోపణలున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్ సిబ్బంది ఆర్సీ విధ్యారాణి సహాయంతో కళాశాలను ఇక్కడ నుండి మల్లంపల్లికి మార్చడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ పైరవీలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఇటీవల రూ.70 లక్షలతో మంజూరైన అదనపు గదుల నిర్మాణ పనులను సైతం ప్రిన్సిపాల్, అద్యాపకులు అడ్డుకుంటున్నారనే విషయం తెలిసిన విద్యార్థుల తల్లి తండ్రులు అదనపు గదుల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పల్లాపు రమణయ్యలు శుక్రవారం కళాశాలకు చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో పాటు కళాశాలను తరలించే కుట్రలు చేస్తున్న ప్రిన్సిపాల్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. కళాశాలను ఇక్కడ నుండి తరలిస్తే తాము ఇబ్బందులు పడతామని తమ పిల్లలను దూరంలో ఉండే మల్లంపల్లికి పంపే స్థోమత తమకు లేదని ఈ విషయంలో ఆర్సీ విధ్యారాణి చొరవ తీసుకుని కళాశాల అభివద్ధికి మంజూరైన 70 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. అలా కాకుండా కళాశాలను మల్లంపల్లికి తరలించే కుట్రలు చేస్తే సహించేదిలేదని, ప్రిన్సిపాల్ అధ్యాపకులను బదిలీ చేసేవరకు ఉధ్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తల్లితండ్రులు పూస నర్సింహారావు, లంజపెల్లి పెద్ద శ్రీనువాస్, దుర్గం నర్సింహారావు, లంజపెల్లి చిన్న శ్రీను, ధీగొండ చిరంజీవి, జాడి రాంబాబు, బంటు విశ్వనాధం, చెన్నూరి సాంబయ్య, సామ మధులు పాల్గొన్నారు.