Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమిషనర్‌కు కార్పొరేటర్ వినతి
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 66వ డివిజన్ పరిధి ఆర్టీసీ కాలనీలోని సర్వే నెం.158, 159, 166, డీపీ నెం.34/92, 3/94 గల పార్క్ స్థలం కబ్జాకు గురవుతోందని, తక్షణమే ఆ స్థలాన్ని కాపాడాలని కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ శుక్రవారం జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు 66వ డివిజన్ హసన్‌పర్తి రెవెన్యూ శివారు సర్వే నెం.158, 159, 166 గల భూమిలో డీపీ నెం.34/92లో 182 మీటర్లు, డీపీ నెం.3/94లో 1600 మీటర్ల భూమిని పార్క్ కోసం కేటాయించారని తెలిపారు. పార్క్ కోసం కేటాయించిన భూమిని భూకబ్జాదారుల నుంచి కాపాడాలన్నారు. పార్క్ స్థలం కబ్జాకు గురికాకుండా ప్రహరి గోడ ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు. అలాగే యాదవనగర్‌లోని పాడుబడిన వ్యవసాయ భూమిని పూడ్చేసీ 66వ డివిజన్ హసన్‌పర్తి అభివృద్దికి సహకరించాలని కమిషనర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో తెలిపారు.