Authorization
Wed March 12, 2025 10:04:05 am
నవతెలంగాణ లింగాలఘనపురం
కరోనా నిబంధనలు పాటిస్తూ ఇష్టంతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు చిట్ల జయశ్రీఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని బండ్ల గూడెం గ్రామంలోని కస్తూర్బాగాందీ బాలికల పాఠశాల విద్యార్థినిలకు ఆల్ఇన్వన్ పుస్తకాలు పంపిణీ చేశారు. న్యూ ఇయర్ కు కెక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలి పారు.పదోవ తరగతిలో 10జీపీఏ సాధించిన ప్రతి ఒక్కరికి ప్రొత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ విజయకుమార్ స్వామి, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, టీిఆర్ఎస్ నాయకులు వెంకటేష్, వెంకట్రెడ్డి, యాదగిరి, యాకన్న, వెంకటేష్,స్పెషల్ ఆపిసర్ అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.