Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని అన్ని గనుల వద్ద నూతన సంవత్సర క్యాలెండర్ను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐ టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపెటీ రాజయ్య మాట్లాడుతూ 20 21 లో కార్మికులు అసం ఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐటీయూ సమరశీల పోరాటాలు నిర్వహించిందన్నారు. ప్రభుత్వాలు సింగరేణి యజమాన్యం అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలపై ఇతర సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు 2022లో నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో నాలుగు బ్లాకులను ప్రైవేటు వారికి కట్టబెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. సింగరేణ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకుండా అన్యాయం చేస్తున్నదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం కార్మికవర్గం పై ఉందని అన్నారు. 2020,21లో అనేక మంది కరోన బారినపడి ప్రాణాలు కోల్పో యారని, ఆర్థికంగా చితికిపోయారన్నారు. 2022లో అలాంటి ఉపద్రవాలు రాకుండా సుభిక్షంగా ఉండాలన్నారు.