Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
శ్రమజీవులకు ఎల్లవేళలా అండగా నిలిచేదే ఎర్ర జెండా అని సీపీఐ జనగామ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి అన్నారు. సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం రావుల సదానందం అధ్యక్షతన జనగామ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. విప్లవోద్యమ గడ్డ జనగామలో కమ్యూనిస్టు పార్టీని విస్తరింపజేయడానికి పార్టీ క్యాడర్ బలంగా పని చేయాలన్నారు. జనవరిలో జరిగే గ్రామ మహాసభల్లో ఈ విషయమై చర్చలు చేయాలని కోరారు. నేడు దేశానికి ఎర్ర జెండా తోనే సుస్థిరత ఏర్పడుతుందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలు,ప్రజలపై భారాలు మోపుతూ, ప్రభుత్వ ఆస్తులు అమ్ముతోందన్నారు. అన్నింటిపై ధరలు పెంచుతూ, దేశాన్ని అధోగతి పాల్చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నాయకులు అది సాయన్న, పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, సొప్పరి సోమయ్య,పండుగ నిర్మల,కూరపాటి విజయకుమార్, కెమిడి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.