Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-నర్మెట్ట
ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. శుక్రవారం నర్మెట్ట శాఖ కార్యదర్శి కొన్నే రవీందర్ అధ్యక్షత న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చేలా ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెడుతోందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగు తున్నాయన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిందన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తిరిగి తీసుకొస్తామని కేంద్రమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇచ్చి గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేప ట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంక ట్రాజం, రాపర్తి రాజు, ఏరియా కార్యదర్శి ప్రజ్ఞపురం నరసింహులు, మండల నాయకులు పండుగ రాజరాం కొన్నే బాలసిద్దులు, రవీందర్, కరుణాకర్ నాగరాజు పాల్గొన్నారు.