Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం వరంగల్ రాజా శ్రీ గార్డెన్లో నిర్వహించిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ కే తలమా నికంగా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని, జిల్లా కేంద్రాన్ని ఆజంజాయి మిల్లు గ్రౌండ్ లో ఏర్పాటు చేసు కుంటున్నామన్నారు. ఖిలావరంగల్ టూరి జంలో అభివృద్ది చెందుతుందన్నారు. జిల్లా కేంద్రం ఇక్కడే ఉండటం ద్వారా పేదల ఆస్థి విలువ పెరుగుతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఒక అద్బుతమైన నియోజకవర్గాన్ని అందించేలా కృషి చేశామన్నారు. వరంగల్ లో ముంపు సమస్యను రూపు మాపేందుకు అగర్తాల నుండి 12 మోరీల లోకి చేరేలా భూగర్బ వరద నీటి కాలువ నిర్మాణాన్ని నిర్మించామన్నారు. అండర్ బ్రిడ్జ్ విస్తరణ చేపట్టా మన్నారు. రూ.191 కోట్లతో నియోజకవర్గంలోని 16 ప్రధాన రహాదారులను అభివృద్ది చేస్తున్నామని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రద్దీ ఉండే నేపద్యంలో ప్రణాళికలు రూపొందించి రోడ్లను అభివృద్ది చేస్తున్నామన్నారు.
దూపకుంటలో 2వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను, జర్నలిస్టులకు దేశాయిపేటలో200 ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. జీఓ 58 ద్వారా గుడిసెవాసులకు పట్టాలందించేం దుకు కృషి చేస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్స్, వెజిటేబుల్ మార్కెట్‌ను అన్ని హంగులతో నిర్మించా మన్నారు. చేనేత దుస్తులు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టి వారికి బాసటగా నిలిచామ న్నారు. రాజకీయాలకతీతంగా 25 వేల పేద కుటుంబాలకు లాక్డౌన్ సమయంలో నిత్యావ సరాలు అందజేసి అండగా నిలిచామన్నారు. సుమారు రూ.3వేలకోట్లకు పైగా సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, నియోజకవర్చంలోని అన్ని రోడ్లు, వివిధ రూపాల్లో అభివృద్ది పనులు చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో మరింత అభివృద్ది చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.