Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నిజాన్ని నిర్భయంగా రాయడంలో నవతెలంగాణ పత్రిక ముందుంటుందని స్టేషన్ ఘన్ పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కె. క్రిష్ణవేణి అన్నారు. నవతెలంగాణ-2022 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఆర్డీఓ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీసి ప్రజలకు న్యాయం జరిగే వరకు నవ తెలంగాణ దినపత్రిక నిరంతరం పని చేయడం అభినందనీయమని అన్నారు. కార్మిక, కర్షక, శ్రామిక, రైతుల ,పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నవ తెలంగాణ పత్రిక నిరంతరం కషి చేయాలని ఆకాంక్షించారు. గతేడాది మంచిచెడులను మరచి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రజలందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ లక్ష్మినారాయణ, డీటీ సునీత, సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, జూనియర్ అసిస్టెంట్లు హరీష్, అవినాష్, సిబ్బంది కిరణ్, నవతెలంగాణ విలేకరి అర్జున్ పాల్గొన్నారు.