Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
తానం రవీందర్ ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని పొగళ్లపల్లి పంచాయతీ చోటుగూడెం గ్రామంలో తానం రవీందర్ స్థూపం వద్ద ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో కనకయ్య తొలుత తానం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో రవీందర్ గిరిజన సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. పోడు భూముల పోరాటాల్లో పేదల కోసం అనేకసార్లు జైలు జీవితం గడిపారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు. రవీందర్ ఆశయాల సాధనకు అనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని, కరోనాతో మరణించిన వారికి రూ. 5 లక్షల పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల్లో పేదలకు 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని, కరోనా రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వర్ధంతి సభలో మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, తానం రాంబాబు, తానం వంశీ, గౌరి నాగేశ్వరరావు, నిమ్మల మధు, రవికుమార్, వెంకటేశ్వర్లు, లక్ష్మినర్సు, టైరు ప్రసాద్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.