Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
యువత సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్సై గండ్రతి సతీష్ ఆకాంక్షించారు. మండలంలోని కంఠాయపాలెంలోని యువతకు అసాంఘీక కార్యకలాపాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడారు. వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని, ఓవర్ స్పీడ్ తగదని చెప్పారు. సైబర్ నేరగాళ్ల వల్ల చాలా మంది మోసపోతున్నారని గుర్తు చేశారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో యువత కీలకమన్నారు. అసాంఘీక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల గురించి అవగాహన పెంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్, తదితరాల బారిన పడొద్దని కోరారు. అసాంఘీక కార్యకలాపాలను సెల్ నెంబర్ 9440904651లో సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గజ్జి రామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ గోసంగి భాస్కర్, వార్డు సభ్యులు పల్లె యాకన్న, గంగారం లకిడి శ్రీధర్, పల్లె సర్వయ్య, మొగిలి మల్లేష్, నిరుకొండ ముత్తయ్య, శివరాత్రి రవి, బైరపాక శ్రీకాంత్, యర్రం రాజు, తదితరులు పాల్గొన్నారు.