Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
ఇటీవల కేరళ రాష్ట్రంలో ధీరజ్‌ను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని వరంగల్ జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు చుక్క ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రంగశాయిపేటలో నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో ఎస్ఎఫ్ఐ నాయకుడు ధీరజ్‌ను హత్య చేయడం దారణమన్నారు. హత్య చేసినంత మాత్రాన ఆయన ఆశయాన్ని చంపలేరని గుర్తుచేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడడం చేతకాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయన అమరత్వానికి సూచికగా భవిష్యత్ పోరాటాలను కొనసాగిస్తామన్నారు. కేరళ ప్రభుత్వం దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బలి చక్రవర్తి, లోకేష్, నితిన్, శోభన్, యాకన్న, ఇమ్రాన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.