Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మల జిల్లాగా నామకరణం చేయాలని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల బిక్షపతి డిమాండ్ చేశారు. బుధవారం పసర పంచాయతీ కార్యాలయం ఆవరణలో బీజేపీ మండలాధ్యక్షుడు మద్దినేని తేజరాజు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సంఘాల జేఏసీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ములుగును జిల్లాను ఏర్పాటు చేస్తానని, ఆ జిల్లాకు సమ్మక్క సారక్కల పేర్లను పెడతానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ములుగు జిల్లాను ఏర్పాటు చేశాడు గానీ సమక్క, సారలక్క జిల్లాగా పేరు పెట్టలేదని విమర్శించారు. వెంటనే తన హామీ మేరకు ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు ఇరుగు పైడి, ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు, మడికొండ రమేష్, ఎంఎస్ పి గోవిందరావుపేట మండల ఇన్చార్జి, తొట్టి యాకయ్య యాదవ్, జే ఏ సీ మండల అధ్యక్షులు ఇనుముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.