Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
పల్లె ప్రగతి, అభివద్ధి పనులపై ప్రత్యేక దష్టి పెట్టాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మండలంలోని రాయపర్తి గ్రామ పంచాయతీని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రకతి వనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై దష్టి పెట్టాలని, ప్రతి రోజూ పర్యవేక్షించాలన్నారు. పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలను పెంచాలన్నారు. ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలన్నారు. వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ కిషన్ నాయక్, ఎంపీఓ రాంమ్మోహన్, ఏపీఓ కుమార్ గౌడ్, సర్పంచ్ గారె నర్సయ్య, జీపీ కార్యదర్శి అశోక్ నాయక్, తదితరులు ఉన్నారు.